ఋణమాఫీ చేయరా? కాంగ్రెస్​ ను రైతులు తరిమి కొడతారు

బీఆర్​ఎస్​ మహాధర్నాలో మాజీ మంత్రి జోగు రామన్న

Aug 22, 2024 - 19:18
Aug 22, 2024 - 21:24
 0
ఋణమాఫీ చేయరా? కాంగ్రెస్​ ను రైతులు తరిమి కొడతారు

నా తెలంగాణ, ఆదిలాబాద్: రైతులకు రుణమాఫీ చేయకుండా ఇబ్బందులకు గురవుతున్న కాంగ్రెస్‌కు భవిష్యత్‌లో గుణపాఠం తప్పదని మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. కాంగ్రెస్ మిడతలను తరిమికొట్టే సత్తా కేవలం రైతులకు మాత్రమే షో.కేటీఆర్ పిలుపు మేరకు ఋణమాఫీపై గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. రైతులకు ఋణమాఫీ అధికారం రాకముందు దేవాలయాలలో ఒట్లు వేసిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను తప్పారని. సంపూర్ణ ఋణమాఫీ కాకపోవడం శోచనీయమన్నారు. రైతుభరోసా ఆర్థిక సహాయం ఏమైందని ప్రశ్నించారు. రూ. 41 వేల కోట్లలో కేవలం రూ. 17 వేల కోట్లను మాత్రమే మాఫీ చేయడం దేనికి నిదర్శనమని ఉంది. ఆందోళన చేస్తున్న రైతులపై అన్యాయంగా కేసులు నమోదు చేశారు. ఎన్నికలు పెట్టిన రైతుల పక్షాన నిలబడి బీఆర్‌ఎస్‌ చేస్తుందని జోగు రామన్న ప్రకటించారు. 

ఈ ధర్నాలో పార్టీ నేతలు రోకండ్ల రమేష్, విజ్జగిరి నారాయణ, యాసం నర్సింగ్ రావు, యూనస్ అక్బని, పట్టణ అధ్యక్షులు అజయ్, సతీష్ పవార్, లింగారెడ్డి, సాజితుద్దీన్ ఉన్నారు.