రాజగోపురంలోనే వనదుర్గమ్మ దర్శనం

Vanadurgamma darshan in Rajagopuram itself

Sep 27, 2024 - 20:49
 0
రాజగోపురంలోనే వనదుర్గమ్మ దర్శనం

నా తెలంగాణ, పాపన్నపేట: ప్రసిద్ద పుణ్యాకేత్రమైన ఏడుపాయల వనదుర్గమ్మ గత మూడు రోజులుగా రాజగోపురంలోనె దర్శనమిస్తున్నారు. వరద ఉధృతి పెరగడంతో వరుసగా నాలుగో రోజు శుక్రవారం కూడా రాజాగోపురంలోనే అమ్మవారి ఉత్సవ విగ్రహానికి  పూజలు కొనసాగాయి. ఎగువన పెరిగిన సింగూరు నీటి ప్రవాహం వల్ల వనదుర్గ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి గంగమ్మ పొంగి పొర్లుతుంది. నీటి ప్రవాహం పెరగడంతో మంగళవారం తాత్కాలికంగా ముత పడిన ప్రధానాలయం నీటి ఉద్రిక్తత తగ్గక పోవడంతో ఆలయాన్ని మూసివేసారు. నీటి వరద తగ్గగానే తిరిగి అమ్మవారి దర్శనం ప్రారంభిస్తామని ఆలయ అర్చకులు, సిబ్బంది పేర్కొన్నారు. నీటి వరద అమ్మవారి ఆలయం ముందు వెళుతున్న సంగతి తెలుసుకున్న భక్తులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకొని వీక్షించారు. భక్తులు అధికసంఖ్యలో రావడంతో ఎవరు నీటి ప్రవాహం వైపు వెళ్లకుండా స్థానిక ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ బ్యారికేడ్స్ ని ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు.