రైతుల సంక్షేమానికి డిసిఎంఎస్ కృషి 

డీసీఎంఎస్​ చైర్మన్​ శివ కుమార్ 

Sep 27, 2024 - 20:47
 0
రైతుల సంక్షేమానికి డిసిఎంఎస్ కృషి 
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: రైతుల సంక్షేమానికి డిసిఎంఎస్ కృషి చేస్తుందని ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని పాత కలెక్టరేటు కాంప్లెక్స్ లో మెదక్ డీసీఎంఎస్ మహాజన సభ సమావేశం శుక్రవారం శివకుమార్ అధ్యక్షతన జరిగింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశానికి ఉమ్మడి మహాజన సభ సమావేశపు అజెండా అంశాల తీర్మానాలు, తీసుకున్న చర్యలు డీసీఎంఎస్ మహాజన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 
 
ఈ సమావేశంలో మెదక్ జిల్లాలోని సహకార సంఘాల అధ్యక్షులు,  డీసీసీబీ ఉపాధ్యక్షులు పట్నం మాణిక్యం, డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు అరిగె రమేష్ కుమార్, మార్క్​ ఫెడ్​ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సంగారెడ్డి జిల్లా శివప్రసాద్​, డీసీసీబీ సీఈఓ  శ్రీనివాస్, డీసీఎంఎస్ డైరెక్టర్లు, డీసీసీబీ డైరెక్టర్లు, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ ఆంజనేయులు తదితరులు హాజరయ్యారు.