ఎకరాకు రూ. 30వేల నష్టపరిహారం

పెద్ద చెరువుకు గండి అధికారులదే బాధ్యత మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి

Sep 3, 2024 - 15:20
 0
ఎకరాకు రూ. 30వేల నష్టపరిహారం
నా తెలంగాణ, మెదక్​: గండిపడ్డ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లోని వరి పొలాలను తక్షణమే ఎకరాకు రూ. 30 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి డిమాండ్​ చేశారు. మంగళశారం పెద్ద చెరువు వద్ద నీటమునిగిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెరువుకు చిన్నగా గండిపడినప్పుడే చర్యలు తీసుకొని ఉంటే ఇంత నష్టం వాటిల్లేది కాదన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. 200 ఎకరాలలో పంట నీట మునిగిందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్దుర వల్ల రాష్​ర్టంలో 32 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదబాధితులను గతంలో కేసీఆర్​ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందో అదేవిధంగా ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. 
 
వెంటనే పెద్దచెరువు కట్ట గంటిని పూడ్చాలని ఆమె డిమాండ్​ చేశారు. అధికారులు, ప్రభుత్వం స్పందించకుంటే తామే తెగిన కట్టను పూడ్చుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పద్మా దేవేందర్​ రెడ్డి వెంట  హవెలిఘనపూర్ మండల బీఆర్​ఎస్​ పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం. లావణ్య రెడ్డి, నాయకులు కిష్టయ్య, మేకల సాయిలు, రామచంద్ర రెడ్డి, సతీష్ రావు, నరేందర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.