ఒకే రోజు మూడిళ్లలో దొంగతనం

గస్తీ పెంచాలన్న కౌన్సిలర్​

Aug 30, 2024 - 13:33
 0
ఒకే రోజు మూడిళ్లలో దొంగతనం

నా తెలంగాణ, మెదక్: ఒకే రోజు మూడు ఇండ్లలో దొంగతనాలు జరిగాయని దొంగతనాల నివారణకు గస్తీలు పెంచాలని ఐదో వార్డు కౌన్సిలర్​ మామిండ్ల ఆంజనేయులు పోలీసులను కోరారు. గురువారం అర్థరాత్రి ఇంద్రపురి కాలనీలోని హనుమంత్​ రెడ్డి, లాల్​ సింగ్​ మోహన్​ గౌడ్​, నరసింహా చారి ఇళ్లలో దొంగతనాలు జరిగాయని తెలిపారు. నగదుతోపాటు బంగారం, పల్సర్​ బైక్​ ను దొంగలు ఎత్తుకెళ్లారన్నారు. దొంగతనాలు చేయడంలో దొంగలు చాకచక్యంగా వ్యవహరించారన్నారు. ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయో చూసుకొని ఆ ప్రాంతాల్లో కాకుండా కెమెరాలు లేని ప్రాంతాల్లోని తాళం వేసిన ఇళ్లనే టార్గెట్​ గా చేసుకున్నారని తెలిపారు. వెంటనే పోలీసులు చోరులను గుర్తించి పట్టుకోవాలని పోలీసులకు ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. అలాగే రాత్రిళ్లు గస్తీ పెంచాలని కోరారు.