మెదక్​ ను పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలి

జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​

Sep 27, 2024 - 20:51
 0
మెదక్​ ను పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలి

 నా తెలంగాణ, మెదక్: మెదక్​ వ్యాప్తంగా ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టర్​ కార్యాలయం సమావేశ మందిరంలో పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. మెదక్​ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటక ప్రాముఖ్యత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువల గురించి అంతర్జాతీయంగా ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఈ టూరిజం డే‌ను నిర్వహిస్తారని తెలిపారు. మెదక్​ లో ఎన్నో అంద‌మైన ప్రదేశాలు, చారిత్రాత్మక నిర్మాణాలు పర్యాటకులను ఎంత‌గానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. పర్యాటక రంగంపై రాస్​ర్ట పర్యాటక శాఖ పలు పోటీలను కూడా నిర్వహిస్తుందని వివరించారు. దీంతో జిల్లా ఆదాయంలోనూ వృద్ధి నమోదు చేసుకోవచ్చన్నారు. అనంతరం పాఠశాలలు, కళాశాలల్లో ఉపన్యాస, వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ధృవపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పర్యాటకంపై ఫోటోలు తీసిన అత్యుత్తమ ఫోటోగ్రాఫర్ల విజేతలకు కూడా ధృవపత్రాలు అందజేసి మెమొంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జెడ్పిసి ఎల్లయ్య, జిల్లా అటవీ అధికారి జో జో తదితరులు పాల్గొన్నారు.