ఐక్యతే బలం విభేదాలు విచ్ఛిన్నానికి కారణం

యోగి మాఫియా స్వచ్ఛతో వణికిస్తున్నారు విచ్ఛిన్నానికి తుక్డే తుక్డే పార్టీలే కారణం మీర్జాపూర్​ సభలో ప్రధాని మోదీ

May 26, 2024 - 14:24
 0
ఐక్యతే బలం విభేదాలు విచ్ఛిన్నానికి కారణం

లక్నో:  మాఫియా స్వచ్ఛతా కార్యక్రమాన్ని యూపీ సీఎం యోగి చేపట్టారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇంతుకుముందు జనం భయపడితే, ఇప్పుడు మాఫియా వణికిపోతోందన్నారు. సమాజంలో ప్రజలు ఐక్యంగా ఉండకుంటే ఆ ప్రభావాలు కూడా వేరే విధంగా ఉంటాయన్నారు. దేశ విచ్ఛిన్నానికి కారణం అవుతాయన్నారు. అసలు సమస్యలపై నుంచి మీ దృష్టిని ఏమార్చే తుక్డే తుక్డే పార్టీలు దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తాయన్నారు. అందుకే దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండడం అత్యంత అవసరమన్నారు. ఐక్యంగా ఉంటే ఆకాశాన్ని అయినా అందుకోగలమని ప్రధాని మోదీ తెలిపారు. 

ఆదివారం యూపీ పూర్వాంచల్​ మీర్జీపూర్​ లో బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పూర్వాంచల్​ ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు. మరోమారు బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

కులాల పోరాటాలు ఆపాలి..

పూర్వాంచల్​ ను అప్రమత్తం చేసేందుకు తాను వచ్చానని పేర్కొన్నారు. కాంగ్రెస్​ అన్ని కులాలను దోచుకుంటుందన్నారు. దళితులు, బ్రాహ్మణులు, రాజ్​ పుత్​ లు, భూమిహార్​ లు, చౌహాన్​లు, బనియాలు, యాదవులు, కుర్మీలు, రాజ్‌భర్‌లు తమలో తాము పోరాడుతూ బలహీనంగా మారాలని విపక్ష పార్టీలు కోరుకుంటున్నాయన్నారు. కులాల వారీగా మనలో మనమే పోరాడితే శత్రుదేశాలు బలోపేతం అవుతాయన్నది మరిచిపోవద్దన్నారు. ఇక కులాల పోరాటాలు ఆపాలన్నారు. మనమంతా ఒక్కటే అనే భావనతో ముందుకు వెళదామని మోదీ పిలుపునిచ్చారు. 

విభజనతో లబ్ధి.. కాంగ్రెస్​ కుయుక్త ఆలోచనలు..

కాంగ్రెస్​, ఎస్పీ, కూటమి పార్టీలు ఇదే విధానాన్ని అనుసరిస్తూ పూర్వాంచల్​ లో విజయం సాధించాలని ప్రజలను విభజించే రాజకీయాలకు పాల్పడుతున్నాయని గుర్తెరగాలన్నారు. కులాల విభజనతో ప్రజల్లో విభజనతోపాటు దేశంలో కూడా విభజన వస్తుందన్నది గుర్తించాలని మోదీ పేర్కొన్నారు. కానీ తమ అభిమతం ప్రజలను, కులాలను ఐకమత్యం ఉంచుతూనే దేశ శక్తి సామర్థ్యాలను, కీర్తి, ప్రతిష్ఠలను కాపాడటమే అన్నారు. అదే సమయంలో దేశ ప్రజల అభివృద్ధి కూడా తమకు ముఖ్యమన్నారు. 

శౌర్యానికి ప్రతీక ఈ నేల..

పూర్వాంచల్​ భూమి శౌర్యానికి ప్రతీక అన్నారు. మంగళ్​ పాండే, మహారాజా సుహెల్దేవ్​, చంద్రశేఖర్​ లాంటి మహానీయులు ఇదే నేలపై నడయాడి తమ ధైర్యాన్ని చాటారని ప్రధాని నరేంద్ర మోద అన్నారు.