ఉల్లి ధరల్లో స్థీరికరణ
71వేల టన్నుల కొనుగోలు 20 శాతం తగ్గిన ఉల్లి పంట
నా తెలంగాణ,న్యూ ఢిల్లీ: దేశంలో ఉల్లిధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపశమన చర్యలకు దిగింది. జూన్ 20న 71వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసినట్లు శనివారం ఉన్నతాధికారులు వివరించారు. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఉల్లిధరల్లో పెరుగుదల నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉల్లిధరలను స్థీరికరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కొనుగోలు చేశామని అధికారులు తెలిపారు. ఈసారి రబీ ఉత్పత్తిలో 20 శాతం ఉల్లి పంట క్షీణించినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో ఉల్లి ధరల పెరుగుదలను ముందే ఊహించామన్నారు. అందుకే సత్వర చర్యలను చేపట్టామన్నారు.
కొనుగోలు చేసిన ఉల్లిని దేశంలోని ఆయా ప్రభుత్వ మార్కెట్ లకు తరలించి ఉల్లి ధరలను స్థీరికరించే చర్యలను చేపట్టామన్నారు. దీని ద్వారా ఉల్లిధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేశామన్నారు.