గేమింగ్​ జోన్​ లో అగ్నిప్రమాదం 30కి చేరిన మృతులు

మృతుల్లో 12మంది చిన్నారులు

May 26, 2024 - 13:50
 0
గేమింగ్​ జోన్​ లో అగ్నిప్రమాదం 30కి చేరిన మృతులు

జైపూర్​: గుజరాత్​ రాజ్​ కోట్​ గేమింగ్​ జోన్​ లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 30కి చేరింది. ఇందులో 12 మంది చిన్నారులు ఉండడం  విచారకరం. 

శనివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదాన్ని రాత్రి 11 గంటల వరకు అధికారులు ఆపగలిగినా అనంతరం రాత్రి గేమింగ్​ జోన్​ లోని పై కప్పు (షెడ్డూ) పూర్తిగా కుప్పకూలింది. దీంతో రాత్రంతా రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగించాయి. ఆదివారం కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 25 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీకెండ్​ కావడం గేమింగ్​ జోన్​ 500 టికెట్​ ను రూ. 99కే ఇస్తున్నామని ప్రకటించడంతో పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు. 

మరమ్మత్తుల సందర్భంగా వెల్డింగ్​ చేస్తుండగా ఆ నిప్పురవ్వలు ఎగిరిపడి మంటలు వ్యాపించినట్లు అగ్నిమాపక శాఖ గుర్తించింది. మంటలు వెంటనే వ్యాపించేందుకు థర్మాకోల్​ షీట్లు, రబ్బరు, రెసిన్​ లాంటివి కూడా కారణంగా పోలీసులు తేల్చారు. మరోవైపు గేమింగ్​ జోన్​ లో 2వేల లీటర్ల డీజిల్​, 1500 లీటర్ల పెట్రోల్​ కూడా నిల్వ ఉంచడంతో మంటలు వాటికి వ్యాపించి ఒక్కసారిగా పెద్ద యెత్తున అగ్నిప్రమాదానికి కారణమైనట్లు గుర్తించారు. 

ప్రమాదంపై కలెక్టర్​ ఆనంద్​ పటేల్​ మాట్లాడుతూ.. మృతదేహాలు కాలిపోవడంతో గుర్తించడం కష్టంగా మారిందన్నారు. డీఎన్​ ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. రెస్క్యూ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఈ ప్రమాదానికి కారణమైన యాజమాని సోలంకిని, మేనేజర్​, మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

ఘటనపై పూర్తి విచారణకు గుజరాత్​ ప్రభుత్వం సిట్​ దర్యాప్తునకు ఆదేశించింది.