రాజౌరి లోయలో పడ్డ బస్సు 21మంది మృతి

69 మందికి గాయాలు పలువురి పరిస్థితి విషమం

May 30, 2024 - 16:30
May 30, 2024 - 18:44
 0
రాజౌరి లోయలో పడ్డ బస్సు 21మంది మృతి

జమ్మూకశ్మీర్​: జమ్మూకశ్మీర్​ లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. 21మంది మృతి చెందగా, 69 మంది గాయపడ్డారు. గురువారం ఉదయం జమ్మూకశ్మీర్​ రాజౌరి నుంచి శివఖోడికి 90 మంది ప్రయాణికులతో ఉత్తరప్రదేశ్​ కు చెందిన బస్సు బయలుదేరిందని పోలీసులు తెలిపారు. బస్సు అఖ్నూర్​ తొంగి మోర్​ కు రాగానే అదుపు తప్పి లోయలోకి దూసుకువెళ్లిందని తెలిపారు. స్థానికుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టామని అఖ్నూర్​ పోలీసు అధికారి తారీఖ్​ అహ్మద్​ వివరించారు. ఈ ప్రమాదంలో 21మంది మృతి చెందారని, 69 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. గాయపడ్డవారిని జమ్మూ మెడికల్ కాలేజీకి తరలించామన్నారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.