చైల్డ్​ ఆసుపత్రిలో పేలుడు ఆరుగురు మృతి

Six killed in explosion at child hospital

May 26, 2024 - 14:53
 0
చైల్డ్​ ఆసుపత్రిలో పేలుడు ఆరుగురు మృతి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని వివేక్​ విహార్​ లో చిన్న పిల్లల ఆసుపత్రిలో శనివారం అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు నవజాత శిశువులు మృతి చెందారు. ఐదుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఆదివారం ఉదయం విచారణ బృందం ఆసుపత్రికి చేరుకొని పలువురు సిబ్బందిని విచారించింది. మొదటి అంతస్థులో ఆసుపత్రి ఉండగా, ఆక్సిజన్​ సిలెండర్లు మాత్రం గ్రౌండ్​ ఫ్లోర్​ లో పెట్టారు. ఈ సిలీండర్లలో పేలుడు వల్ల అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి కారణాలను ఇంకా నిర్ధారించలేదని అగ్నిమాపకశాఖ ఉన్నతాధికారి అతుల్​ గార్గ్​ తెలిపారు. ప్రమాదంపై ఆసుపత్రి యాజమాన్యంపై ఐపీసీ సెక్షన్లు 336, 304ఎ, 34 కింద ఎఫ్​ ఐఆర్​ నమోదు చేసినట్లు తెలిపారు. ప్రమాదం తరువాత యాజమాని పరారీలో ఉన్నాడన్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామన్నారు.