మాజీ రాష్ట్రపతి కోవింద్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు
Union Minister Kishan Reddy's birthday wishes to former President Kovind
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారతదేశ అభివృద్ధికి అంకితభావం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేసిన సేవలు ఎనలేనివని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం రామ్ నాథ్ కోవింద్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భగవతుడు ఆయనకు ఆయురారోగ్యాలను, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని కోరారు. దేశవ్యాప్తంగా మాజీ రాష్ట్రపతికి కోవింద్ కు ఉన్న గౌరవ ప్రతిష్ఠలను కొనియాడారు.