లక్నోలోని పది హోటళ్లకు బాంబు బెదిరింపులు
Bomb threats to ten hotels in Lucknow
లక్నో: రైల్వేలపై దాడులు, విమానాలకు బాంబు బెదిరింపులు, పాఠశాలలు, తాజాగా హోటళ్లకు కూడా ఈ బెదిరింపుల పర్వం పాకింది. ఆదివారం లక్నోలని మారియట్, ఫార్చ్యూన్, టెమన్ ట్రీ సహా 10 పెద్ద హోటళ్లను పేల్చివేస్తామని మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. బెదిరించిన వ్యక్తి 55వే డాలర్లు డిమాండ్ చేశాడు. నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. సరకా, పిక్కడిల్లీ, కంఫర్ట్, విస్టా, క్లార్క్, అవధ్, కాసా, దయాల్, సిల్వెట్ హోటళ్లలకు కూడా బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. హోటళ్లలో తనిఖీలకు ఉపక్రమించారు. మరోవైపు ఈ బెదిరింపుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతిలోని హోటల్ కు కూడా ఇదే మాదిరి బెదిరింపులు వచ్చాయి. ఆ తరువాత మరికొన్ని హోటళ్లకు కూడా బెదిరింపులు వచ్చాయి. ఈ వరుస పరిణామాలను గమనిస్తుంటే దేశవ్యతిరేక, విచ్ఛిన్నకర శక్తులు చేస్తున్న పనియే అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు కేంద్ర ఇంటలిజెన్స్ కూడా దీనిపై ఓ కన్నేసి ఉంచింది. కేంద్రమంత్రి వర్గం ఇలాంటి బెదిరింపుల పట్ల కఠిన నిర్ణయాలు, చట్ట సవరణలు చేపట్టనునుంది.