మత విశ్వాసాలను దెబ్బతీస్తున్న హస్తం

మనోభావాలు కించపరిచే వ్యాఖ్యలు దురదృష్టకరం.. సేలం పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Mar 19, 2024 - 19:49
 0
మత విశ్వాసాలను దెబ్బతీస్తున్న హస్తం

సేలం: హిందూ మతం, విశ్వాసాలు, నమ్మకాలను నాశనం చేయాలని ఇండికూటమి ప్రయత్నిస్తోందని, ఉద్దేశపూర్వకంగానే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్​ పార్టీపై విరుచుకుపడ్డారు. కానీ హిందూ మతంలోని శక్తి అంటే ఏంటో తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. మంగళవారం సేలంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ఇక్కడి బీజేపీ నేతలు రమేష్, కేఎన్ లక్ష్మణన్‌ ల సేవలను కొనియాడారు. వీరిద్దరూ పార్టీకి చేసిన సేవలు అభినందనీయమన్నారు. బీజేపీ ఆడిటర్​గా పనిచేస్తున్న రమేష్​ 2013లో హత్యకు గురయ్యారు. ​ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో కే.ఎన్. లక్ష్మణన్ పాత్ర మరువలేనిదన్నారు. వయసు రీత్యా అనారోగ్యంతో మృతి చెందారు. తమిళనాడు అభివృద్ధి, శ్రేయం కోసం కేంద్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే ఇంటింటికీ మంచినీరు, ఉచిత వైద్యం, ఉజ్వల గ్యాస్, మహిళా సంఘాలకు విరివిగా రుణాలు, రైతులకు ఎకరాకు రూ. 6000, యువత, నిరుద్యోగులకు అవకాశాలు వంటి ప్రధానమైన వాటిని వివరించారు. ఏప్రిల్​ 19న జరిగే ఎన్నికల్లో ప్రతీ ఓటూ బీజేపీకే వేయాలన ప్రధాని కోరారు. కాంగ్రెస్, డీఎంకేలు కలిసి తమిళనాడును దోచుకుతింటున్నాయని మండిపడ్డారు. మాతృశక్తి, మహిళా శక్తిపై కూడా ఈ రెండు పార్టీలు విమర్శలు చేయడం వీరి అవివేకానికి నిదర్శనమని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.