సీఎం కేజ్రీకీ కోర్టు డబుల్​ షాక్​

జ్యూడీషియల్​ కస్టడీ పెంపు, బెయిల్​ పిటిషన్​ తిరస్కరణ

Jun 5, 2024 - 16:22
 0
సీఎం కేజ్రీకీ కోర్టు డబుల్​ షాక్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ కు కోర్టు డబుల్​ షాకిచ్చింది. జ్యూడీషియల్​ కస్టడీ పెంచడంతోపాటు, మధ్యంతర బెయిల్​ పిటిషన్​ ను తిరస్కరించింది. బుధవారం రౌస్​ అవెన్యూ కోర్టు వీడియో కాన్ఫరెన్స ద్వారా ఆయన కేసును విచారించింది. పిటిషన్లపై తీర్పు వెలువరించింది. జ్యూడీషియల్​ కస్టడీ జూన్​ 19 వరకు పొడిగించింది. మరోవైపు తన ఆరోగ్యం బాగాలేదని పిటిషన్​ లో పేర్కొనడంతో కోర్టు ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్​ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎక్సైజ్​ పాలసీ మనీలాండరింగ్​ కు సంబంధించి ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్ఝీషీట్​ ను ప్రత్యేక న్యాయమూర్తి జూలై 9న విచారించనున్నారు. మనీలాండరింగ్​ కింద (పీఎంఎల్​ ఏ) కింద ఆప్​ పార్టీపై కేసు నమోదైంది.