మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు ఖాయం

ముంబాయి పర్యటనలో కేంద్రమంత్రి అమిత్​ షా

Oct 1, 2024 - 17:52
 0
మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు ఖాయం
ముంబయి: మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా వెల్లడించారు. మంగళవారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు షా సమావేశం అయ్యారు. బీజేపీ నేతృత్వంలో అందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. విజయం ఎంతో దూరంలో లేదన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఈ సమావేశలో రాష్​ర్ట డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​, రాష్​ర్ట బీజేపీ అధ్యక్షుడు​ చంద్రశేఖర్​ బవాన్కులే, ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్​ షెలార్​ తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా పార్టీ వర్గాల్లో కేంద్రమంత్రి షా ఉత్సాహాన్ని నింపారు. మహాకూటమిని అడ్డుకునే శక్తి మహారాష్ర్టలో లేదన్నారు. ఎన్నికల్లో గెలుపొందాక కామన్​ సివిల్​ కోడ్​ అమలు చేస్తామని చెప్పారు. ఈ రాష్ర్ట సమస్యలను పరిష్కరించడంలో దేవేంద్ర ఫడ్నవీస్​ అత్యంత సమర్థుడని కితాబిచ్చారు. నాయకులంతా ప్రచార శైలిలో ఆయనను అనుసరించాలన్నారు. వివాదాలకు తావీయవద్దన్నారు. 
 
మహాయుతిలో సీఎం పదవి బీజేపీకే దక్కుతుందన్నారు. నాయకులు, కార్యకర్తలు పూర్తి ఉత్సాహంతో పనిచేయాలన్నారు. 10 శాతం ఓట్లను పెంచుకునేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. దీంతో 20 నుంచి 30 సీట్ల వరకు పెంచుకోవచ్చని తెలిపారు. ఇతర పార్టీల్లో నుంచి ఎవ్వరు వచ్చినా వారికి సముచిత గౌరవం దక్కాలన్నారు. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోగలమని కేంద్రమంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు.