స్పృహతప్పి పడిపోయిన గడ్కరీ ప్రమాదం లేదన్న వైద్యులు

Union Minister Gadkari fainted during the election campaign

Apr 24, 2024 - 17:10
 0
స్పృహతప్పి పడిపోయిన గడ్కరీ ప్రమాదం లేదన్న వైద్యులు

ముంబై: ముంబై యావత్మల్​ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి నితీన్​ గడ్కరీ స్పృహతప్పి పడిపోయారు. ఆయన చుట్టూ ఉన్న వారంతా ఆయన్ను కాసేపు పక్కన తీసుకువెళ్లి సపర్యలు చేశారు. నీరందించారు. చికిత్సనందించారు. బుధవారం యవత్మాల్​ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తలతిరగడంతో ఆయన కింద పడిపోయారని వైద్యులు తెలిపారు. ప్రమాదం ఏమీ లేదన్నారు. కొద్దిసేపటి తరువాత గడ్కరీ ప్రసంగించారు. రెండో దశ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బుల్దానా, అకోలా, అమరావతి, వార్ధా, హింగోలి, నాందేడ్, పర్భానీలలో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. విదర్భలో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ శాఖ 27 నుంచి 29 వరకు మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలకు హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేసింది.