శాంతి కోసం బంగ్లా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం

అమెరికా విదేశాంగ మంత్రి మాథ్యూ మిల్లర్​

Aug 8, 2024 - 13:50
 0
శాంతి కోసం బంగ్లా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం

ఢాకా: బంగ్లాదేశ్‌లో దీర్ఘకాలిక శాంతి, రాజకీయ స్థిరత్వాన్ని కొనసాగించడంలో తాత్కాలిక ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. గురువారం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మాథ్యూ మిల్లర్​ మీడియాతో మాట్లాడారు. బంగ్లాదేశ్​ లో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. మహమ్మద్​ యూనస్​ నియామకాన్ని తాము చూస్తున్నామని తెలిపారు. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం శాంతి, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య సూత్రాలు, చట్టాలు, పాలన ప్రజల అభీష్ఠాన్ని గౌరవించాలని మాథ్యూ అన్నారు. నూతన ప్రభుత్వం వివాదాలను, హింసను దూరం చేయగలుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.