నమ్మకం, విశ్వసనీయతలో.. మోదీ లాంటి నాయకులు అమెరికాకు అవసరం

JP Morgan CEO Dion has no one more trusted than Modi

Apr 24, 2024 - 17:53
 0
నమ్మకం, విశ్వసనీయతలో.. మోదీ లాంటి నాయకులు అమెరికాకు అవసరం
  •  సవాళ్లు, ప్రతిసవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు
  • నిరుపేదలను పేదరికం నుంచి బయటకు
  • బ్యాంకు ఖాతాలు, డిజిటల్​ చెల్లింపులు నేరుగా ఖాతాల్లోకే సంక్షేమ ఫలాలు భేష్
  •  జేపీ మోర్గాన్​ సీఈవో జామీ డియోన్​

న్యూఢిల్లీ: నమ్మకం, విశ్వసనీయత ఉన్న మోదీ లాంటి నాయకుడు అమెరికాకు అవసరమని జేపీ మోర్గాన్​ సీఈవో జామీ డియోన్​ ప్రశంసించారు. బుధవారం డియోన్​ ఓ ప్రైవేటు కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. సవాళ్లు, ప్రతిసవాళ్లను మోదీ ధైర్యంగా ఎదుర్కొనే తీరు విభిన్నమైనదన్నారు. ముఖ్యంగా ఆయన విదేశీనీతి ఓ వైపు ప్రపంచశాంతి, క్షేమం కోరుకుంటుందన్నారు. అదే సమయంలో సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడంలో మోదీ సునిశిత దృష్టి భేష్​ అని కితాబిచ్చారు.

భారత్​ లో 400 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగారని పేర్కొన్నారు. మూడోసారి కూడా మోదీ అధికారంలోకి రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల మోదీ నేతృత్వంలో భారత్​ సంస్కరణలు చాలా బాగుతున్నాయన్నారు. ముఖ్యంగా దేశ ప్రజలందరికీ బ్యాంకు ఖాతాలు, డిజిటల్​ చెల్లింపులు, సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా లబ్ధిదారులకే అందించడం లాంటివి అతి ముఖ్యమైన నిర్ణయాలని డియోన్ తెలిపారు. 

మరోవైపు భారత్​ లో విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన వేగంగా విస్తరిస్తోందన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు శ్రేష్టమైన పన్ను విధానాన్ని మోదీ తీసుకువచ్చారని దీంతో అవినీతి తగ్గడంతోపాటు దేశాభివృద్ధికి తోడ్పడుతోందని సీఈవో జామీ డియోన్ ప్రశంసల జల్లు కురిపించారు.