ఐపీసీ ‘498ఎ’పై దేశవ్యాప్త ఆందోళన
Nationwide agitation on IPC '498A'
సుభాష్ మృతితో వరకట్న కేసులపై మారోమారు రెకెత్తుతున్న అనుమానాలు
ఈ చట్టంకింద నమోదయ్యే కేసులపై జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీం ఆదేశం
మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనన్న పురుషుల హక్కుల సంఘం
బెంగళూరు: వరకట్న వేధింపుల కేసుపై సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అతుల్ సుభాష్ కేసు దేశంలో సంచలనం సృష్టిస్తుంది. వరకట్న వేధింపుల పేరుతో దేశవ్యాప్తంగా ఐపీసీ ‘498ఎ’ను దుర్వినియోగం చేస్తున్నారనే చర్చ మరోమారు తెరపైకి వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టం కింద నమోదైన కేసులపై జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు, ఆయా రాష్ర్టాల న్యాయస్థానాలకు సూచించింది. 498 ఎ కింద నమోదైన కేసుల్లో ఆరోపణలపై పూర్తి విచారణ అనంతరమే కేసులు నమోదు చేయాలని పేర్కొంది. సుభాష్ ఆత్మహత్య సందర్భంగా వీడియో విడుదల చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. దీంతో వరకట్న కేసులపై మరోమారు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్ బీ) వరకట్న వేధింపుల నకిలీ కేసుల డేటాను పరిశీలిస్తే 2022లో చట్టం కింద మొత్తం 356 కేసులు, 2021లో 418, 2020లో 297, 2019లో 462 కేసులు తప్పుడు కేసులుగా నిర్థరించారు. కాగా అతుల్ సుభాష్ మరణంపై ఢిల్లీకి చెందిన పురుషుల హక్కుల సంఘం కార్యకర్త బర్ఖా టెహ్రాన్ తీవ్రంగా ఖండించాడు. ఇతని మరణానికి వరకట్న కేసే కారణమన్నాడు. భార్య, అత్తా, మామలు, వీడియోలో విడుదల చేసిన వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశాడు.