కాషాయమయంగా చార్మినార్ ప్రాంగణం
Union Minister Anurag Thakur campaigned in Charminar in support of BJP Hyderabad MP candidate Madhavilatha.
- బీజేపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ ర్యాలీ
నా తెలంగాణ, హైదరాబాద్: ఓల్డ్ సిటీలోని చార్మినార్ ప్రాంగణం కాషాయమయంగా మారింది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత బుధవారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాధవీలత చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. ఆమె నామినేషన్ ర్యాలీగా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.