కేసీఆర్, కాంగ్రెస్ లపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఫైర్
Union Minister G. Kishan Reddy fire on KCR and Congress
సంఘటన పర్వ్ వర్క్ షాప్ లో నాయకులు, కార్యకర్తలకు సూచనలు
పార్టీ బలోపేతంపై చర్యలు
ప్రజాభిప్రాయాలను సేకరించాలి
డిసెంబర్ 1 నుంచి వైఫల్యాలపై చార్జీషీట్లు
నా తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ ప్రజల పోరాట ఫలితానికి బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ పాలన మొత్తం కుటుంబమయమని, కేసీఆర్ అహాంకారాన్ని, అవినీతిని బద్ధలు కొట్టాలని కాంగ్రెస్ ను ప్రజలు ఎన్నుకుంటే బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లోనే నడుస్తుందని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
శనివారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో సంఘటన పర్వ్ వర్క్ షాప్ లో పాల్గొని ప్రసంగించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా సంసిద్ధతపై చర్చించారు. గత నిర్ణయాలు, అభిప్రాయాలను సేకరించి ఎన్నికలకు వెళదామన్నారు.
కేసీఆర్ అహాంకారం, అవినీతి, కాంగ్రెస్ మోసాలను వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువువెళ్లాలన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీని ప్రజలకు దరిచేర్చాలన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో అండగా నిలుస్తుందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన, కేంద్ర పథకాలు, రైల్వేల అభివృద్ధి లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కేంద్రం చేపడుతుందని స్పష్టం చేశారు. రానున్న సమయంలో తెలంగాణ ప్రజా సమస్యలపై కార్యక్రమాలకు రూపకల్పన చేసి బీజేపీ ఉద్యమబాట దిశలో నడవాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లలాగా బీజేపీ కుటుంబ పార్టీ కాదని స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. బూత్ స్థాయి నుంచి మంచి నాయకత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కమిటీల ఏర్పాటులో పారదర్శకతతో బలమైన కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
డిసెంబర్ 1 నుంచి బీజేపీ తెలంగాణ ముందు కాంగ్రెస్ పాలన ఏడాది వైఫల్యాలపై చార్జీషీట్లు పెట్టబోతున్నామని స్పష్టం చేశారు. రానున్న సమయంలో నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లి వీరి పాలనను ఎండగట్టాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.