ఘనంగా ఆలయ 18వ వార్షికోత్సవం

Celebrating the 18th anniversary of the temple

May 26, 2024 - 22:59
 0
ఘనంగా ఆలయ 18వ వార్షికోత్సవం

నా తెలంగాణ,రామకృష్ణాపూర్ : స్థానిక రామాలయం చౌరస్తాలోని అభయాంజనేయ స్వామి ఆలయ 18వ వార్షికోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఉదయం నుండే వేద పండితులు పురుషోత్తమ చార్యులు,కిరణాచార్యులు,కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో అర్చన,అభిషేకం,హోమం, సహస్రనామ పూజలతో పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.హనుమాన్ దీక్ష స్వాములు భిక్ష చేయగా భక్తులకు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.సాయంత్రం భజన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహంకాళి శ్రీనివాస్,కౌడగని సాంబయ్య,చంద సదానందం,పోగుల మల్లయ్య, పులి శ్రీనివాస్ రాస సంపత్,నల్గొండ నర్శింగం, సత్యనారాయణ,సుమన్,బాపు,కుమార్ తదితరులు పాల్గొన్నా