కేజ్రీవాల్ పై లిక్విడ్ దాడి!
Liquid attack on Kejriwal!
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగింది. శనివారం గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఓ వ్యక్తి లిక్విడ్ తో దాడికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులో తీసుకున్నారు. నిందితున్ని కొట్టారు. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో కూడా కేజ్రీవాల్ పై దాడులు జరిగిన ఘటనలున్నాయి. ఢిల్లీ సీఎం అతిశీ, మంత్రి సౌరభ్ భరద్వాజ్ లు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.