ఉల్టా చోర్​ కొత్వాల్​ కో డాటే

కాంగ్రెస్​, విపక్షాల తీరు సీనియర్​ న్యాయవాది, బీజేపీ ఎంపీ అభ్యర్థి ఉజ్వల్​ నికమ్​

May 16, 2024 - 13:24
 0
ఉల్టా చోర్​ కొత్వాల్​ కో డాటే

ముంబై: ఉల్టా చోర్​ కొత్వాల్​ కో డాటే (దొంగనే పోలీసును తిట్టాడన్నట్లు)గా కసబ్​ వ్యవహారంలో కాంగ్రెస్​, విపక్షాల తీరు ఉందని సీనియర్​ న్యాయవాది, బీజేపీ ఎంపీ అభ్యర్థి ఉజ్వల్​ నికమ్​ మండిపడ్డారు. కర్కరేను చంపినట్లు  వైపు కసబే అంగీకరిస్తే కాంగ్రెస్​, విపక్షాలు మాత్రం అతను చంపలేదని, పోలీసుల బుల్లెట్​ వల్లే ఆయన మృతిచెందాడని అనడంపై ఉజ్వల్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ప్రతిష్ఠను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉంటే వీరి వ్యవహారశైలి మాత్రం దేశానికి ద్రోహం చేసేలా ఉందని మండిపడ్డారు.

తాను దేశద్రోహులు, సంఘ విద్రోహ శక్తులపై కోర్టులో పోరాడేవాడినన్నారు. అందుకే దేశాన్ని శాంతియుతంగా, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలు చేకూర్చే పార్టీ బీజేపీలో చేరానని ఉజ్వల్​ స్పష్టం చేశారు.

కసబ్​ విషయంలో నలుగురు బృందంతో పాక్​ వెళ్లిన వారిలో తాను ఒకడినని వివరించారు. ఎనిమిది రోజులు ఇస్లామాబాద్​ లో ఉండి పూర్తి ఆధారాలను సరిచూసుకున్నామని తెలిపారు. కుట్రకు ప్రధాన సూత్రధారి హఫీజ్​ సయీద్​ గా నిర్ధారణ జరిగిందన్నారు. జకీవుర్​ రెహ్మాన్​ కూడా మరో కుట్రదారు అన్నారు. కానీ వీరిపై పాక్​ ఎలాంటి కేసులు నమోదు చేయలేదని ఉజ్వల్​ నికమ్ మండిపడ్డారు.