సీఎం వెంట స్వాతి పై దాడి చేసిన నిందితుడు

సామాజిక మాధ్యమాల్లో వైరల్​ మహిళా వ్యతిరేకపార్టీ ఆప్​ కేజ్రీవాల్​ కాపాడుతున్నారన్న బీజేపీ

May 16, 2024 - 13:48
 0
సీఎం వెంట స్వాతి పై దాడి చేసిన నిందితుడు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: స్వాతిమాల్​ పై వేధింపులకు పాల్పడ్డ వైభవ్​ కుమార్​ ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ వెంట బుధవారం రాత్రి విమానాశ్రయంలో ఉన్న ఫోటోపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. ఈ ఫోటోను పూనావాలా గురువారం తన సామాజిక మాధ్యమంలో షేర్​ చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు.

ఆప్​ పార్టీలో మహిళలకు దక్కే గౌరవం ఇదేనా అని సూటిగా ప్రశ్నించారు. స్వాతిపై దాడి చేసిన నిందితుడు సాక్షాత్తూ సీఎం వెంటే తిరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. మహిళలపై ఆప్​ పార్టీకి ఎంత గౌరవం ఉందో తెలుసుకోవాలన్నారు. 

నిందితుడు వైభవ్​ ను సాక్షాత్తూ సీఎం అరవింద్​ కేజ్రీవాలే కాపాడుతున్నారని నీ ఫోటో చూస్తే స్పష్టం అవుతుందని పేర్కొన్నారు. ఓ వైపు నిందితులపై చర్యలుంటాయని పేర్కొని వారితోనే చెట్టాపట్టాలేసుకొని తిరగడం వీరి ద్వంద్వ విధానాలకు నిదర్శనమన్నారు. బీజేపీ పార్టీ స్వాతిమాలివాల్​ పై జరిగిన దాడిపై సమగ్ర విచారణ కోరుకుంటుందని, నిజనిజాలను నిగ్గుతేల్చి ప్రజల ముందుంచాలని డిమాండ్​ చేస్తుందని పూనావాలా డిమాండ్​ చేశారు.
బీజేపీ నేత కపిల్ మిశ్రా కూడా ఈ ఫోటోను షేర్​ చేస్తూ పలు విమర్శలు చేశారు. ఆప్​ పార్టీ మహిళా వ్యతిరేక పార్టీ అన్నారు. స్వాతిమాలివాల్​ ను బెదిరిస్తున్నారని స్పష్టమవుతోందన్నారు. అందుకే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయిందని పేర్కొన్నారు.