కాంగ్రెస్​, ఎస్పీ విద్రోహ పార్టీలే

పౌరసత్వం కల్పిస్తున్నాం ఉగ్రవాదులనూ విడిచిపెట్టారు భద్రత విషయం దేవుడెరుగు రౌడీయిజం తాండవించేది అసాంఘిక శక్తులపై యోగి ఉక్కుపాదం యూపీ అభివృద్ధికే తొలి ప్రాధాన్యం 370 రద్దుతోనే కాశ్మీర్​ అభివృద్ధి ఆజంఘడ్​ సభలో ప్రధాని నరేంద్ర మోదీ

May 16, 2024 - 13:07
 0
కాంగ్రెస్​, ఎస్పీ విద్రోహ పార్టీలే

లక్నో: ఎస్పీ, కాంగ్రెస్​ రెండు దేశ విద్రోహ పార్టీలేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. యూపీలోని ఆజంఘడ్​ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. కూటమి, కాంగ్రెస్​ పార్టీలు అవినీతి, అక్రమాలు, కుటుంబ పార్టీలని అన్నారు. హిందువుల పేరు చెప్పుకుంటూ రామ మందిరాన్ని వ్యతిరేకించే వారే వీరన్నారు. సీఏఏ పౌరసత్వాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా పౌరసత్వం ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. గతంలో యూపీలోని ప్రజలు, వ్యాపారుల భద్రత దేవుడెరుగని పేర్కొన్నారు. అడుగడుగునా రౌడీయిజాన్ని ప్రోత్సహించారని తెలిపారు. ఓ వైపు దేశవ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదుల కూడా గౌరవిస్తూ వారిని జైళ్లలో నుంచి విడిపించిన పార్టీలే కాంగ్రెస్​, కూటమి పార్టీలని గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. సురక్షిత భారత, సురక్షిత యూపీ కావాలంటే మరోమారు నిజాయితీ పార్టీ బీజేపీకే ఓటు వేయాలని మోదీ విజ్ఞప్తి చేశారు.

యూపీ నుంచి రౌడీయిజాన్ని తరిమికొట్టిన యోగి ప్రభుత్వం రాష్ర్ట అభివృద్ధికి నాందీ పలకడం చూస్తున్నారని తెలిపారు. నిరుపేద సంక్షేమం, యువతకు ఉపాధి, హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడే దేవాలయాలకు ప్రాణం పోయడం, బహుళార్థక ప్రాజెక్టుల నిర్మాణం, రైతులకు మద్ధతు ధరలు, మహిళలకు అన్ని రంగాల్లో భాగస్వామ్యం మోదీ నేతృత్వంలో యూపీ యోగి ప్రభుత్వం ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు.
పేరుకే అఖిలేష్​ యాదవ్​ హిందూ అని చెప్పుకుంటారని కానీ శ్రీకృష్ణునిపై ఏ మాత్రం భక్తి, గౌరవం లేని వ్యక్తి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువరాజు వెంట నడుస్తూ ఆయన బుద్ధి కుట్ర వక్రమార్గాలు పట్టిందన్నారు. వీరిద్దరి దుకాణం ఒకటే అని మోదీ మండిపడ్డారు. సీఏఏ, ఆర్టికల్​ 370ల మీద ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తమ ప్రభుత్వం వాటన్నింటినీ తిప్పికొట్టిందని పేర్కొన్నారు. సీఏఏ ద్వారా పౌరసత్వాలు తప్పక కల్పించి తీరుతామని ఇప్పటికే ఆ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. 

ఆర్టికల్​ 370 రద్దు తరువాత కాశ్మీర్​ ఏ విధంగా అభివృద్ధి దిశలో వెళుతుందో ప్రతీఒక్కరూ గమనిస్తున్నారని తెలిపారు. కాశ్మీర్​ లో గతంలో ఎక్కడ, ఎప్పుడు చూసినా బాంబుపేలుళ్లు, తుపాకుల శబ్ధాలు, యువత భవితవ్యం ప్రశ్నార్థకం మార్చారని మండిపడ్డారు. నేడు అదే యువతను కష్టపడే మంచి మార్గం వైపు మళ్లించామన్నారు. భవిష్యత్తులో కాశ్మీర్​ యువతకు అనేక ఉపాధి మార్గాలు కల్పిస్తామన్నారు. ఆ దిశగా ప్రజలంతా తమతో సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.