ఢిల్లీ చేరుకున్న అధ్యక్షుడు మొయిజ్జు
రాష్ట్రపతి, ప్రధానిలతో ద్వైపాక్షిక చర్చలకు సిద్ధం ఐదురోజులపాటు భారత్ లో పర్యటన
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎట్టకేలకు మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ తన సతీమణి సాజిదా మహమ్మద్ తో కలిసి భారత పర్యటనకు వచ్చారు. ఆదివారం సాయంత్రం న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు భారత అధికారులు ఘన స్వాగతం పలికారు. ఐదురోజులపాటు భారత్ లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఇరుదేశాల దౌత్యసంబంధాలపై ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 10వరకు భారత్ లో పర్యటించనున్నారు. మొయిజ్జుకు ఇది తొలి ద్వైపాక్షిక పర్యటన కావడం విశేషం. ముంబై, బెంగళూరులో కూడా పర్యటించనున్నారు. ఇరుదేశాల విదేశాంగ శాఖలు తీసుకున్న చర్యలు సానుకూలంగా ఉండడంతో భారత్–మాల్దీవుల మధ్య ఉన్న విబేధాలు సమసిపోయినట్లయ్యింది. దీంతో మొయిజ్జు పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది.