నిరసనల మధ్య యథావిధిగా పార్లమెంట్ సమావేశాలు
Parliament meetings as usual amid protests
రైల్వే ప్రయాణికులకు సబ్సిడీ
హింసకాండపై విపక్షాలు వాయిదా తీర్మానం
మాజీ సీఎంపై దాడి ఖండన
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంట్ సమావేశాలు బుధవారం యథావిధిగా కొనసాగుతున్నాయి. నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులకు కేంద్రమంత్రులు సమాధానం చెప్పే అవసరం లేదని సభా కార్యకలాపాలను కొనసాగించాలని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అనుబంధ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సభా కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆయన్ను వారించారు.
ప్రతి రైల్వే ప్రయాణీకుడికి 46 శాతం సబ్సిడీ: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్..
దేశంలోని ప్రతి రైల్వే ప్రయాణీకుడికి ప్రయాణ టిక్కెట్‌పై 46 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ, రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణీకుల కోసం సబ్సిడీపై ప్రతి సంవత్సరం రూ. 56,993 కోట్లను ఖర్చు చేస్తుందన్నారు. వృద్ధులు, గుర్తింపు పొందిన జర్నలిస్టులకు గతంలో ఇచ్చిన సబ్సిడీని పునరుద్ధరించే అవకాశం గురించి అడిగినప్పుడు వైష్ణవ్, భారత ప్రభుత్వం ప్రయాణీకులకు ఇచ్చిన మొత్తం సబ్సిడీ రూ. 56,993 కోట్లు. ప్రతి రూ.100 ప్రయాణ సేవకు రూ.54 వసూలు చేస్తారు. అన్ని వర్గాల ప్రయాణికులకు 46 శాతం సబ్సిడీ ఇస్తారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో దేశం మొత్తం రోడ్ల ద్వారా అనుసంధానించబడిందని, అదే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలోని చిన్న, మధ్య తరహా రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయని వైష్ణవ్ ఒక అనుబంధ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
హింసాకాండపై ఇండి కూటమి నిరసన వాయిదా తీర్మానం..
అదానీ కేసు, సంభాల్, మణిపూర్ హింసకాండపై ప్రతిపక్ష ఇండీ కూటమికి చెందిన ఎంపీలు బుధవారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో నిరసన తెలిపారు. అదానీ కేసును విచారించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. నిరసనకారుల్లో కాంగ్రెస్, ఆప్, ఆర్జేడీ, శివసేన, యూబీటీ, డీఎంకే, వామపక్ష పార్టీల ఎంపీలు ఉన్నారు. ఈ నిరసనలో టీఎంసీ పాల్గొనలేదు. కూటమి నేతలు చర్చ ఆయా అంశాలపై విచారణ చేపట్టాలని వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు.
మాజీ సీఎంపై దాడి ఖండన..
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో అకాలీదళ్ నేత సుఖ్భీందర్ బాదల్‌పై కాల్పుల ఘటనను పలువు అధికార, విపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వర్ణ దేవాలయం వద్ద ఈ సంఘటన చోటు చేసుకోవడం రాష్ర్ట ప్రభుత్వం వైఫల్యమేనని ఆరోపించారు.