ఆరో దశకు రెఢీ 58 స్థానాల్లో 889 మంది పోటీ మే 25న పోలింగ్
889 people contested in 58 constituencies for the sixth phase and polling was held on May 25
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: మే 25న ఆరో దశలో ఎనిమిది రాష్ర్టాల్లో 58 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 889 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా 223 మంది అభ్యర్థులు హరియాణా నుంచి రంగంలో ఉండగా, అత్యల్పంగా కేవలం ఒక్క స్థానానికి జమ్మూకశ్మీర్ లో 20 మంది పోటీలో ఉన్నారు.
ఉత్తరప్రదేశ్: యూపీలోని సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్, ఫుల్‌పూర్, అలహాబాద్, అంబేద్కర్ నగర్, శ్రావస్తి, దుమారియాగంజ్, బస్తీ, సంత్ కబీర్ నగర్, లాల్‌గంజ్, అజంగఢ్, జౌన్‌పూర్, మచిల్‌షహర్, భదోహిలలో మే 25న 14 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 162 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
హరియాణా: ఆరోదశలో హరియాణాలోని 10 స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నారు. ఇక్కడి నుంచి 223 మంది అత్యధికంగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనిపట్, రోహ్‌తక్, భివానీ-మహేంద్రగఢ్, గుర్గావ్, ఫరీదాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.
బీహార్: బిహార్ లోని 8 ఎంపీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి 86 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వాల్మీకినగర్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, షెయోహర్, వైశాలి, గోపాల్‌గంజ్, సివాన్, మహరాజ్‌గంజ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి.
జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి మూడో దశలో ఎన్నికలు జరగాల్సి ఉంది. వాతావరణం కారణంగా ఆరో దశకు ఓటింగ్ వాయిదా పడింది. ఇక్కడ మొత్తం 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మే 25న శనివారం ఎన్నికలు జరగనున్నాయి.
ఝార్ఖండ్: లోక్‌సభ చునావ్ 2024 ఓటింగ్ ప్రత్యక్ష ప్రసారం: జార్ఖండ్‌లోని గిరిది, ధన్‌బాద్, రాంచీ మరియు జంషెడ్‌పూర్ లోక్‌సభ స్థానాలకు శనివారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఒడిశా: సంబల్‌పూర్, కియోంజర్, దెంకనల్, కటక్, పూరీ, భువనేశ్వర్ లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి మొత్తం 64 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్: ఆరోదశలో పశ్చిమ బెంగాల్‌లోని ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమ్లుక్, కంఠి, ఘటల్, ఝర్‌గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకురా, బిష్ణుపూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానాల్లో మొత్తం 79 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.
ఢిల్లీ: చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ లోని ఏడు ప్రాంతాల్లో మే 25న ఎన్నికలు జరగనున్నాయి.