పాక్​ కు మద్ధతు చైనా సంస్థలపై అమెరికా ఆంక్షలు

బీజింగ్​ లో ప్రకంపనలు పాక్​ కు సాంకేతికత అందజేత మరణశాసనమే ఆ సంస్థల భవిష్యత్​ ప్రశ్నార్థకం!

Sep 13, 2024 - 16:28
 0
పాక్​ కు మద్ధతు చైనా సంస్థలపై అమెరికా ఆంక్షలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పాకిస్థాన్​ క్షిపణి కార్యక్రమానికి చైనా కు చెందిన నాలుగు సంస్థలు సహాయం చేయడంపై అమెరికా వార్నింగ్​ ఇచ్చింది. నాలుగు చైనా సంస్థలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. అమెరికా నిర్ణయంతో బీజింగ్​ లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని అమెరికా ప్రతినిధి మాథ్యూ మిల్లర్​ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.  రాకెట్​ లను ప్రయోగించేందుకు బీజింగ్​ రీసెర్చ్​ ఇన్​ స్టిట్యూట్​ పాక్​ కు బాలిస్టిక్​ క్షిపణుల తయారీలో సహకారం అందజేసింది. పలు ఒప్పందాల ప్రకారం ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న దేశాలకు ఇలాంటి సాంకేతికత అందజేత, సహాయంపై నాటో, ఐక్యరాజ్యసమితి దేశాల ప్రకారం అందజేయకూడదనే నిబంధనలున్నాయి. పలుమార్లు పాక్​ బహిరంగంగానే ఉగ్రవాద దేశంగా ముద్రపడినందున ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా మెసలు కోవాలని అత్యాధునిక సాంకేతికత అందజేత ఇతర దేశాలకు మరణశాసనం కాగలదనే నిబంధనలున్నాయి. 
 
లువో టెక్నాలజీ, చాంగ్​ జౌ యుటెక్​, జనరల్​ టెక్నాలజీ లిమిటెడ్​ లాంటి సంస్థలపై యూఎస్​ ఆంక్షలు విధించింది. దీంతో ఆయా సంస్థలకు విదేశాల నుంచి సరఫరా కానున్న ముడిపదార్థాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దీంతో ఆ సంస్థల భవిష్యత్​ ప్రశ్నార్థకం కానుంది.