అక్రమ అరెస్టులపై మండిపడ్డ బీఆర్ ఎస్
మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
నా తెలంగాణ, మెదక్: బీఆర్ ఎస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టులపై మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంపల్లి నివాసంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలిని హౌస్ అరెస్టు చేయడంపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అరెస్టులను ఖండిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే బీఆర్ఎస్ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కాంగ్రెస్, ఎమ్మెల్యే గాంధీ అనుచరులు, గుండాలను అరెస్టు చేయాలని పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి ఆర్కే శ్రీనివాస్ జయరాజ్, హవేలీ ఘనపూర్, మెదక్ మండల నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు జయరాం రెడ్డి, ఎస్. సాయిలు, ఆంజనేయులు, ప్రభాకర్, ఎలక్షన్ రెడ్డి, గంజి. నవీన్, శ్రీనివాస్ గౌడ్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.