వడ్డీ చెల్లించాలి బంగ్లాకు రష్యా లేఖలు

రూ. 5300 కోట్ల వడ్డీ బకాయిలు సమయానికి చెల్లించకుంటే 2.4 శాతం అదనపు వడ్డింపు

Sep 13, 2024 - 16:01
 0
వడ్డీ చెల్లించాలి బంగ్లాకు రష్యా లేఖలు

మాస్కో: రూప్పూర్​ న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్​ కు ఇచ్చిన రుణం లేదా వడ్డీని వెంటనే తిరిగి చెల్లించాలని బంగ్లాదేశ్​ ప్రభుత్వాన్ని రష్యా ప్రభుత్వం కోరింది. శుక్రవారం బంగ్లాదేశ్​ ప్రభుత్వం సెప్టెంబర్​ 15 వరకు రుణం చెల్లించాలని రష్యా అధికారులు స్పష్టం చేశారు. 

వడ్డీ రూ. 5300 కోట్లను చెల్లించాలని పేర్కొంది. రష్యా అధికారులు ఆగస్ట్​ 21నే ఆర్థిక విభాగానికి రుణం లేదా వడ్డీ చెల్లించాలని లేఖ రాశారు. అయినా బంగ్లా ప్రభుత్వం రష్​యా లేఖపై స్పందించలేదు. 

అణు విద్యుత్​ ప్లాంట్​ కోసం బంగ్లాదేశ్​ కు రష్​యా 12.65 బిలియన్​ డాలర్లు (రూ. 1.06 లక్షల కోట్లు) రుణం ఇచ్చింది. దీనిపై నాలుగు శాతం వడ్డీ చెల్లించాలని నిబంధనల్లో స్పష్టం చేసింది. ఆలస్యం చేస్తే మరో 2.4 శాతం ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఇరుదేశాల మధ్య చెల్లింపుల ఒప్పందం జరిగింది. ఒకవేళ బంగ్లాదేశ్​ సెప్టెంబర్​ 15వ తేదీ వరకు రష్​యాకు వడ్డీ బకాయిలు చెల్లించకుంటే అటుపిమ్మట 2.4 శాతం అదనపు వడ్డీతో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన రష్యాకు 6.4 శాతం వడ్డీని బంగ్లాదేశ్​ చెల్లించాల్సి ఉంటుంది.