లావోస్ లో ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం
Red carpet welcome to PM Modi in Laos
వియాంటియాన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లావోస్ లోని వియాంటియాన్ కు చేరుకున్నారు. అక్కడ లావోస్ ప్రభుత్వం ప్రధానికి రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. బుధవారం ఉదయం న్యూ ఢిల్లీ నుంచి లావోస్ కు పయనమయ్యారు. స్వాగతం అనంతరం హోటల్ కు చేరుకోగానే ప్రవాస భారతీయులు ప్రదానికి ఘన స్వాగతం పలికారు. 21వ ఆసియాన్ ఇండియా సమ్మిట్ లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి మోదీ రెండు రోజుల లావోస్ పర్యటనలో ఉన్నారు. సాయంత్రం లావోటియన్ రామయణ ప్రదర్శనను తిలకించనున్నారు. ఆగ్రేయాసియాలో ఈ ఇతిహాసం అత్యంత ప్రసిద్ధి, పురాతనమైనదిగా భావిస్తారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, శ్రేయస్సులకు ప్రయత్నిస్తానని ప్రధాని మోదీ తెలిపారు.