గ్రామీణ అక్షరాస్యత శాతం పెరుగుదల

కేంద్ర సహాయ శాఖ మంత్రి జయంత్​ చౌదరి

Dec 4, 2024 - 17:24
 0
గ్రామీణ అక్షరాస్యత శాతం పెరుగుదల

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: గ్రామీణ అక్షరాస్యత శాతం పెరిగిందని విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. బుధవారం 2022–23కు సంబంధించిన గ్రామీణ అక్షరాస్యత శాతంపై వివరాలందించారు. 2023–24లో 77.5 శాతానికి పెరిగిందన్నారు. 22–23లో 83.6 శాతంగా ఉన్న పురుషుల అక్షరాస్యత రేటు 2023–24లో 84.7 శాతానికి పెరిగిందన్నారు. అదే సమయంలో బాలికల విద్యాశాతం 70.3 శాతంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అక్షరాస్యత పెంచేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు.