యూపీఐ మోసం 85 శాతం పెరిగాయి

కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్​ చౌదరి

Nov 27, 2024 - 17:49
 0
యూపీఐ మోసం 85 శాతం పెరిగాయి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో 2023లో యూపీఐ  లావాదేవీలలో మోసం కేసులు 85 శాతం పెరిగాయని పార్లమెంట్​ లో ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్​ చౌదరి తెలిపారు. ఆరు నెలల్లో రూ. 485 కోట్ల మోసం జరిగిందని బుధవారం పార్లమెంట్​ కు తెలిపారు. సాంకేతికపరంగా చెల్లింపులు భారీగా పెరుగుతుండడంతో మోసాలు కూడా పెరిగాయన్నారు. 2022–23కు సంబంధించి రూ. 8300 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరిగాయన్నారు. లావాదేవీలలో మోసాలకు సంబంధించి 7.25 లక్షల కేసులు నమోదైనట్లు వివరించారు. 2020 నుంచి ఆర్బీఐ సెంట్రల్​ పేమెంట్​ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీని ప్రారంభించిందన్నారు. చెల్లింపుల్లో మోసాలను నిరోధించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక మోసాల నుంచి చెల్లింపుదారులను ముందుగానే హెచ్చరించేందుకు ఎన్​ పీసీఐ చర్యలు తీసుకుంటుందన్నారు. అదే సమయంలో 1930 ద్వారా అనేక ఆర్థిక మోసాలను అరికట్టిందన్నారు. ఈ టోల్​ ఫ్రీ నెంబర్​ ద్వారా ప్రజల ఆర్థిక లావాదేవీలకు రక్షణ కల్పిస్తుందన్నారు.