అజ్మీర్ దర్గాపై పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు
The court that received the petition against Ajmer Dargah
ఇరుపక్షాలకు నోటీసులు
డిసెంబర్ 5న విచారణ
జైపూర్: అజ్మీర్ దర్గా శివాలయమే అన్న పిటిషన్ ను స్థానిక కోర్టు విచారణకు స్వీకరించింది. బుధవారం ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసింది. అజ్మీర్ లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా దేవాలయంగా ప్రకటించాలని హిందూసేన కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను అజ్మర్ వెస్ట్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ మన్మోహన్ చందేల్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై చందేల్ దర్గా కమిటీ, మైనార్టీ వ్యవహారాలు, ఎఎస్ ఐలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 5న చేపట్టనుంది.
హిందూ సంస్థలు చాలా కాలంగా అజ్మీర్ దర్గాను దేవాలయంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. 2022లో, హిందూ సంస్థ మహారాణా ప్రతాప్ సేన, ఇది ఆలయమని పేర్కొంటూ, అప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి, దానిపై దర్యాప్తు చేయమని కోరింది. మహారాణా ప్రతాప్ సేన అధికారులు ఒక ఫోటోను కూడా పంపారు. ఆ ఫోటోలో దర్గా కిటికీలపై స్వస్తిక్ గుర్తులు ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఈ దర్గా శివాలయమని దీన్ని దర్గాగా మార్చారని సంస్థ వ్యవస్థాపకుడు రాజవర్ధన్ సింగ్ పర్మార్ చెప్పారు.