అవినీతి, దేశ వ్యతిరేక కార్యకలాపాలే న్యాయవ్యవస్థకు ముప్పు

కాంగ్రెస్ పై మండిపడ్డ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Mar 28, 2024 - 19:25
 0
అవినీతి, దేశ వ్యతిరేక కార్యకలాపాలే న్యాయవ్యవస్థకు ముప్పు

న్యూఢిల్లీ: అవినీతి, దేశ వ్యతిరేక కార్యకలాపాలే దేశానికి, ప్రజాస్వామ్యానికి, న్యాయ ప్రక్రియ ముందుకు సాగేందుకు ముప్పుగా పరిగణించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్​ లో పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే న్యాయవ్యవస్థకు ముప్పు వాటిల్లుతోందని న్యాయవాదులు సీజేఐకి రాసిన లేఖపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అవినీతికి పాల్పడుతున్న వారంతా ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి నష్టం చేకూర్చాలని భావిస్తున్నారని మండిపడ్డారు. వారు భారత న్యాయ వ్యవస్థను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరులను భయపెట్టడం కాంగ్రెస్​ పార్టీకి అనాదిగా వస్తున్న సంస్కృతి అని పేర్కొన్నారు. ఐదు దశాబ్ధాల క్రితమే వారు న్యాయవ్యవస్థను పరిమితం చేసేందుకు ప్రయత్నించారని అన్నారు. తమ స్వప్రయోజనాలు తప్ప దేశ క్షేమం ఏ మాత్రం వారికి పట్టదని, నిబద్ధతో కూడిన పాలన వారికి చేతగాకపోవడంతోనే దేశ ప్రజలు వారిని కూర్చోబెట్టారన్న సంగతి  మర్చిపోయారని మండిపడ్డారు. 

రాజకీయ కేసుల విచారణ సందర్భంగా ఒత్తిళ్లు వస్తున్నాయనే అంశంపై న్యాయవాదులు సీజేఐకి లేఖ రాయడంపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ద్వారా వారి చర్యలను ఖండించారు.