హమాస్​ తో యుద్ధం ఆపేది లేదు

బందీలకు నరకం చూపుతున్నారు రోజుకో వీడియో అంతర్జాతీయ సమాజానికి కనిపించడం లేదా? ఐడీఎఫ్​ అధికారి ఒసామా హమ్దాన్​ 

May 30, 2024 - 17:23
 0
హమాస్​ తో యుద్ధం ఆపేది లేదు

జేరూసలెం: హమాస్ తో యుద్ధం ఆపేది లేదని మరోమారు ఇజ్రాయెల్​ స్పష్టం చేసింది. తమ బందీలను పట్టుకొని రోజుకో నరకాన్ని చూపిస్తున్నారని పేర్కొంది. హమాస్​ అంతమే తమ చివరి లక్ష్యమని పేర్కొంది. ఈ విషయంలో ఎవ్వరేమీ చెప్పినా వినేది లేదని ఐడీఎఫ్​ అధికారి ఒసామా హమ్దాన్ గురువారం ప్రకటించారు. తమ బందీలందరినీ పూర్తి సురక్షితంగా తమ వద్దకు చేరిస్తే మరో విషయం ఆలోచిస్తామన్నారు. అంతే తప్ప బందీలకు నరకం చూపుతూ రోజుకో వీడియోలు విడుదల చేయడం అంతర్జాతీయ సమాజానికి తప్పనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇటీవలే మహిళని చూడకుండా రక్తం కారేలా వారిని చిత్రహింసలు చేసిన వీడియో వీరికి కనిపించలేదా? అని మండిపడ్డారు. ఏది ఏమైనా ఇక హమాస్​ ఉగ్రవాదులు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వారిని వెతికి వేటాడుతామని స్పష్టం చేసింది. రఫాపై దాడులు కొనసాగిస్తామని ఒత్తిళ్లకు వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేసింది. 

మరోవైపు అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని హమాస్​ కు నచ్చజెబుతున్నా వారిని విడిచేది లేదని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.