59వేల వక్ఫ్ ఆస్తుల ఆక్రమణ
పార్లమెంట్ లో కేంద్రమంత్రి రిజిజు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ లో 59వేల వక్ఫ్ ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. పార్లమెంట్ కు బుధవారం లిఖితపూర్వక సమాధానం అందేశారు. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ల ప్రకారం, అనధికార ఆక్రమణలు, వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు ఉందని లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో మంత్రి తెలిపారు. వక్ఫ్ ఆస్తిని విక్రయించడం, బహుమతి చేయడం, మార్పిడి చేయడం, తనఖా పెట్టడం లేదా బదిలీ చేయడం వంటివి చెల్లవని చట్టం నిర్ధారిస్తుందన్నారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను తగిన చర్యల కోసం రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతున్నట్లు మంత్రి తెలిపారు.