కుల్గామ్​ లో ఎన్​ కౌంటర్​  ఇద్దరు ఉగ్రవాదులు హతం

Two terrorists killed in encounter in Kulgam

Sep 28, 2024 - 16:33
Sep 28, 2024 - 17:27
 0
కుల్గామ్​ లో ఎన్​ కౌంటర్​  ఇద్దరు ఉగ్రవాదులు హతం
ఆరుగురు అరెస్ట్
భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కుల్గామ్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. శనివారం మధ్యాహ్నం ఆదిగామ్ దేవ్ సర్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్, సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో ఒక జవానుకు గాయాలయ్యాయి. అతన్ని స్థానిక కుల్గామ్ మిలట్రీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందజేస్తున్నారు. 
మరోవైపు అవంతిపోరాలో చేపట్టిన తనిఖీల్లో ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేయగా వారి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, భారత కరెన్సీ, పిస్తోళ్లు, బుల్లెట్లు, హ్యాండ్ గ్రెనెడ్లు, సెల్ ఫోన్, బ్యాటరీలు, పలు రకాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
 
జమ్మూకశ్మీర్‌లో చివరిదశ ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా ఆర్మీ, పోలీసులు, ఇంటిలిజెన్స్‌లు సంయుక్తంగా భారీ ఎత్తున సెర్చింగ్ ఆపరేషన్‌లకు దిగుతున్నారు. మరోవైపు పాక్‌ ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు స్థానిక యువత ఎన్నికల్లో దాడులు చేసేలా ప్రేరేపిస్తున్నారని ఇంటిలిజెన్స్ గుర్తించారు. పట్టుబడ్డ ఆరుగురు ఉగ్రవాదులు జైష్ ఏ మహమ్మద్ కు చెందిన వారిగా భద్రతా దళాలు పేర్కొన్నారు. 
..............