49వేల హత్యలకు అబ్దుల్లా, నెహ్రూలదే బాధ్యత

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా

Sep 26, 2024 - 17:30
 0
49వేల హత్యలకు అబ్దుల్లా, నెహ్రూలదే బాధ్యత
శ్రీనగర్​: 40వేల హత్యలకు అబ్దుల్లా, నెహ్రూలే బాధ్యత వహించాలని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. గురువారం జమ్మూకశ్మీర్​ లోని మూడోవిడత ఎన్నికల ప్రచారం సందర్భంగా చెనాని, ఉదంపూర్​ లలో జరిగిన బహిరంగ సభలో మంత్రి అమిత్​ షా మాట్లాడారు. కాంగ్రెస్​, ఎన్సీపీలు ఫరిడవిల్లుతోన్న జమ్మూకశ్మీర్​ లో మళ్లీ ఉగ్రవాదాన్ని తేవాలనుకుంటున్నాయని మండిపడ్డారు. కానీ ఉగ్రవాదాన్ని నరకపు లోతుల్లో పాతిపెడతామని షా హెచ్చరించారు. ఫరూక్​ విహారయాత్రలకు లండన్​ వెళ్లి ఖరీదైన మోటార్​ సైకిల్లు నడుపుతారన్నారు. ఈ రాష్ర్టంలో ఉగ్రవాదాన్ని మాత్రం అంతం చేసేందుకు రాదన్నారు. దేశ పార్లమెంట్​ ఉగ్రవాది అఫ్జల్​ గురుకు ఉరిశిక్ష విస్తే ఒమర్​ అబ్దుల్లాకు బాధేందుకని ప్రశ్నించారు. ఉగ్రవాదులకు బిర్యానీ తినిపించిన నీతిమాలిన చర్య వీరిదన్నారు. జమ్మూకశ్మీర్​ లో ఉగ్రవాదం ఫరిడవిల్లేందుకు ఇలాంటి వారే కారణమన్నారు. సామాన్య ప్రజానీకం జీవితాలను నరకప్రాయంగా మార్చారని మండిపడ్డారు. 
 
3వేల రోజులు కర్ఫ్యూనా?..
ఈ రాష్ర్టంలో 40యేళ్లపాటు ఉగ్రవాదంతో 40వేలమందిని పొట్టన బెట్టుకునేందుకు ఈ పార్టీలే కారణమన్నారు. 3వేల రోజులపాటు కర్ఫ్యూ విధిస్తారా? రాష్​ర్టం అభివృద్ధి ఏమైపోతోందని ప్రశ్నించారు. పాక్​ ప్రేరేపిత ఉగ్రవాదులు బాంబులు, బుల్లెట్లు పేల్చుతుంటే ఇక్కడి యువత చేతుల్లో రాళ్లు పెట్టి తమ రాజకీయం పబ్బం గడుపుకుంటారా? అని మండిపడ్డారు. 370 రద్దుతో జమ్మూకశ్మీర్​ అభివృద్ధి వైపు వెళుతుంటే చూస్తూ ఓర్వజాలలేకపోతున్నారని మండిపడ్డారు. 
 
70యేళ్లలో జమ్మూకశ్మీర్​ ను కాపాడారా?..
ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్​, ఎన్సీలు అపహాస్యం చేస్తున్నాయని తెలిపారు. అబ్దుల్లా, ముఫ్తీ, నెహ్రూల కుటుంబాలు 70యేళ్లపాటు జమ్మూకశ్మీర్​ ను కాపాడాయా? ఉగ్రవాదాన్ని అంతం చేయగలిగాయా? అని ప్రశ్నించారు. లెఫ్ట్​ నెంట్​ గవర్నర్​ పాలన రాహుల్​ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇందిరా, రాజీవ్​ గాంధీల హయాంలోనే రాష్​ర్టపతి పాలన ఎక్కువ సమయం ఉందని రాహుల్ తెలుసుకోవాలని షా పేర్కొన్నారు. 
 
దేశ, రాష్​ర్ట హితాన్ని కాంక్షించే మోదీ ప్రభుత్వానికే ఓటేయాలి..
ఆర్టికల్​ 370 రద్దు అనంతరం తొలిసారి రాష్ర్టంలో ఎన్నికలు జరుగుతున్నాయని వీటిలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యతను బీజేపీ కల్పించిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జమ్మూకశ్మీర్​ అభివృద్ధికి నాందీ పలికి ఉగ్రవాదాన్ని తుదముట్టించామని, రాళ్లదాడుల నుంచి విముక్తి కల్పించామని షా తెలిపారు. ప్రజలు ఉగ్రపార్టీల దురాలోచనలకు కాకుండా అభివృద్ధిని, దేశ హితాన్ని కాంక్షించే మోదీ ప్రభుత్వానికే ఓటు వేయాలని అమిత్​ షా విజ్ఞప్తి చేశారు.