నా తెలంగాణ, సంగారెడ్డి: ఉద్యమ స్ఫూర్తి ప్రదాత గొప్ప పోరాట యోధురాలు తెలంగాణ పౌరుషాన్ని, పోరాట స్ఫూర్తిని చాటి చెప్పిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని, ఆమె ఆశయ స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం చాకలి ఐలమ్మ 129వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
జిల్లా కలెక్టరేట్ ప్రక్కన గలవీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ లతో కలిసి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని, తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమస్ఫూర్తిని ప్రదాత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వెనుక బడిన తరగతుల శాఖ అధికారి జగదీష్, రజక సంఘం ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.