లెబనాన్​ దిశగా ఇజ్రాయెల్​ ట్యాంకులు

Israeli tanks towards Lebanon

Sep 28, 2024 - 16:16
 0
లెబనాన్​ దిశగా ఇజ్రాయెల్​ ట్యాంకులు
హిజ్బొల్లా చీఫ్​ హతం
15యేళ్లకే ఇజ్రాయెల్​ పై ద్వేషం
ఏడుగురిని మట్టుబెట్టిన ఐడీఎఫ్​
ఇరాన్​ తలదూరిస్తే మేమూ అడుగేస్తాం: అమెరికా వార్నింగ్​
ఇజ్రాయెల్​ లో హై అలర్ట్​
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ఎట్టకేలకు ఇజ్రాయెల్​ తన పంతం నెగ్గించుకుంటోంది. హిజ్బొల్లా చీఫ్​ హసన్​ నస్రుల్లాను అంతమొందించింది. అమెరికా ఈ దాడికి సిగ్నల్​ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు మొస్సాద్ నెట్ వర్క్​ ను ఉపయోగించి నస్రుల్లా బీరూట్​ లో ఉన్న ఖచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించి నిర్దరించుకున్నాక ఒక్కసారిగా వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో ఈ దాడుల్లో నస్రుల్లాతోపాటు అతని కూతురు జైనత్​, సోదరుడు, హిజ్బొల్లా ఆర్మీ కమాండర్​ తో సహా మరో ముగ్గురు మృతి చెందారు. నస్రుల్లా మృతితో ఆయన సోదరుడిని హిజ్బొల్లా చీఫ్​ గా చేయాలని నిర్ణయించారు. 
 
నస్రుల్లా.. 
నస్రుల్లా 1992 నుంచి ఇరాన్ -మద్దతు గల సంస్థ హిజ్బుల్లాకు చీఫ్‌గా ఉన్నారు. 32యేళ్ల నుంచి ఈ బాధ్యతలను వహిస్తున్నాడు. 15యేళ్లకే ఇజ్రాయెల్​ పై ద్వేషం పెంచుకున్నాడు. 1982లో హిజ్బొల్లా ఏర్పడగా ఈ సంస్థలో సభ్యుడిగా కొనాసగాడు. అనంతరం 1992లో చీఫ్​ గా ఎంపికయ్యాడు. 2006లో ఇతని ఆధ్వర్యంలో లెబనాన్​ నుంచి ఇజ్రాయెల్​ దళాలను వెనక్కి పంపగలిగాడు. 
 
ఇజ్రాయెల్​ దాడుల్లో మృతులు..
హసన్​ నస్రుల్లా (హిజ్బొల్లా చీఫ్​), ఫూవాద్​ షుకర్​ (టాప్​ కమాండర్​), ఇబ్రహీం అకిల్​ (ఆపరేషనల్​ చీఫ్​), అల్​ కాక్రీ (సౌత్​ లెబనాన్​ చీఫ్​ కమాండర్​, వసీమ్​ అల్​ తవీల్​ (కమాండర్​), తాలిబ్​ సలీమ్​ అబ్దుల్లా (నాసర్​ యూనిట్​ కమాండర్​), మహమ్మద్​ నాసేర్​ (యూనిట్​ కమాండర్​). 
 
ఇరాన్​ ఖమేనీ అత్యవసర సమావేశం..
హిజ్బొల్లా చీఫ్​ నస్రుల్లా మృతి వార్త తెలుసుకున్న ఇరాన్​ అధ్యక్షుడు అయతుల్లా ఖమేనీ ఆ దేశ రక్షణ, భద్రతాధికారులతో ఉన్నతస్థాయిలో చర్చలు జరిపారు. ఇజ్రాయెల్​ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్​ దాడులపై ఇస్లామిక్​ ప్రపంచం అంతా ఒక్కటై తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అదే సమయంలో అధ్యక్షుడు ఖమేనీని ఆ దేశ ఇంటలిజెన్స్​ సురక్షిత ప్రాంతానికి తరలించింది.  నస్రుల్లా మృతికి బదులు తీర్చుకోవాలని ఇస్లామిక్​ దేశాలు ఒక్కటై సమాధానం చెబుతామని పిలుపునిచ్చారు. 
 
గత పదిరోజుల్లో ఇజ్రాయెల్​ దాడులు..
17 సెప్టెంబర్​ పేజర్లు బ్లాస్ట్​ 12 మంది మృతి
18 వాకీ టాకీలు బ్లాస్ట్​ 27 మంది మృతి
20 సెప్టెంబర్​ 70మిస్సైళ్ల దాడులు 45 మంది మృతి
21 సెప్టెంబర్​ 400 మిస్సైళ్ల దాడులు 14 మంది మృతి, 
22 సెప్టెంబర్​ 150 మిస్సైళ్ల దాడులు 23 మందికి తీవ్ర గాయాలు
23 సెప్టెంబర్​ 1600  ప్రాంతాల్లో దాడులు 558 మంది మృతి
24 సెప్టెంబర్​ బీరూట్​ లో దాడి ఆరుగురు మృతి
25 సెప్టెంబర్​ బాల్బెక్​, బేల్​ లో దాడులు 51 మంది మృతి
26 సెప్టెంబర్​ బీరూట్​ లో దాడులు ఐదుగురు మృతి
27 సెప్టెంబర్​ బీరూట్​ లో దాడులు ఆరుగురు మృతి
 
అమెరికా–ఇజ్రాయెల్​ అప్రమత్తం..
మధ్యప్రాచ్యం నుంచి ఇజ్రాయెల్​ కు దారి తీసే సముద్రంలో అమెరికా ఇప్పటికే భారీ ఎత్తున తన యుద్ధ నౌకలను రంగంలోకి దింపింది. ఒకవేళ ఇరాన్​ రంగంలోకి దిగితే తాము కథనరంగంలోకి దిగక తప్పదని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్​ లెబనాన్​, బీరూట్​ దిశగా పెద్ద యెత్తున యుద్ధట్యాంకులను తరలిస్తోంది. ఐడీఎఫ్​ దళాలు లెబనాన్​ లోకి ప్రవేశించడంలో ఇస్లామిక్ దేశాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. లెబనాన్​ ను కూడా గాజాల భస్మీపటలం చేసే యోచనలో ఇజ్రాయెల్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా జరిగితే ఇజ్రాయెల్​ ఫలితం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరికలు జారీ చేసింది.