నవంబర్ 26లోపే మహా ఎన్నికలు!
సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటన
ముంబాయి: మహారాష్ట్రలో నవంబర్ 26లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు కమిషన్ బృందం మహారాష్ట్రలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పర్యటనలో ఉన్నామని తెలిపారు. పర్యటన సందర్భంగా అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు, సంఘాల నుంచి వారి వారి అభిప్రాయాలను నమోదు చేస్తున్నామని తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకు ఎన్నికల నిర్వహణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని రాజీవ్ కుమార్ ప్రకటించారు.