నీట్ రద్దు చేయలేం: సుప్రీం.. 1563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్షలు
జూన్ 23న పరీక్ష, జూన్ 30న ఫలితాలు పరీక్షలా? మార్కులు లేకుండా కౌన్సెలింగ్? విద్యార్థులకు రెండు ఆప్షన్లిచ్చిన ఎన్టీఏ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నీట్ పరీక్షను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో గ్రేస్ మార్కులు పొందిన 1563 మందికి జూన్ 23న మళ్లీ పరీక్షలు నిర్వహించాలని, జూన్ 30న ఫలితాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గురువారం నీట్ పరీక్షపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. అవకతవకల పిటిషన్ ను విచారించిన సుప్రీం గ్రేస్ మార్కులు వచ్చిన వారికి పరీక్ష నిర్వహించాలని ఎన్డీయేను ఆదేశించింది. గ్రేస్ మార్కుల విషయంపై ఎన్టీఏను సుప్రీం ప్రశ్నించింది. కొన్ని పరీక్ష కేంద్రాల్లో సమయం వృథా కావడంతో విద్యార్థులకు గ్రేస్ మార్కులు అందజేసినట్లు తెలిపారు. 44 మంది విద్యార్థుల మార్కులు 720 అయ్యాయని ఎన్టీఏ తన వివరణలో పేర్కొంది. గ్రేస్ మార్కులను రద్దు చేయాలని సుప్రీం ఎన్టీఏను ఆదేశించింది.
అయితే గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు ఎన్టీఏ రెండు ఆప్షన్ లను ఇచ్చింది. గ్రేస్ మార్కులు లేకుండా కౌన్సెలింగ్ కు వెళ్ళే అవకాశం, లేదా ఈ నెల 23న జరిగే పరీక్షల్లో హాజరయ్యే అవకాశాన్ని ఎన్టీయే కల్పించింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల్లో కేవలం 1563 మంది విద్యార్థులకు సంబంధించిన ఫలితాలకే సమస్య పరిమితమైందని ఎన్టీయే సుప్రీంకు తెలిపింది.