వసతి గృహంలో అగ్నిప్రమాదం ఇద్దరు మృతి
Two killed in hostel fire
చెన్నై: తమిళనాడులోని మదురై కాట్రపాళయంలోని మహిళా వసతి గృహంలో అగ్నిప్రమాదం చోటు చేసుకొని ఇద్దరు మృతి చెందారు. గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. హాస్టల్ లో మొత్తం 40మందికిపైగా బాలికలు ఉంటున్నారని స్థానికులు తెలిపారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ, అధికారులు వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు మదురై కలెక్టర్ సంగీత అధికారులను ఆదేశించారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్ ను నడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.