సౌదీలో పాక్ బిచ్చగాళ్లు, పిక్ పాకెటర్లు
హెచ్చరించిన ప్రభుత్వం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పాక్ కు సౌదీ మరోమారు హెచ్చరికలు జారీ చేసింది. త్వరలోనే తమ దేశ బిచ్చగాళ్ల మాఫియాను సౌదీ రాకుండా అడ్డుకోవాలని పేర్కొంది. బుధవారం సౌదీ అరేబియా డిప్యూటీ ఇంటీరియర్ మంత్రి నాసర్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ దావూద్ పాక్ మంత్రి మొహ్సిన్ రజా నఖ్వీకి ఈ విషయాన్ని ఘాటూగానే చెప్పారు. పాకిస్తాన్ బిచ్చగాళ్ళను పంపడం మానేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మక్కా మసీదు నుంచి అరెస్టు చేసిన పాక్ జాతీయులలో పిక్ పాకెట్లలో 90 శాతం మంది ఉన్నారని మంత్రి తెలిపారు. ప్రతీయేటా హజ్ యాత్ర పేరుతో ఇక్కడకు వచ్చి బిచ్చగాళ్లుగా, పిక్ పాకెటర్లుగా అవతారం ఎత్తడాన్ని ఆయన తీవ్రంగా తీసుకున్నారు. ఈ చర్యలకు వెంటనే ముగింపు పలకాలన్నారు. లేకుంటే ఇరుదేశాల మధ్య మరింత సామాజిక అస్థిరత పెరుగుతుందని హెచ్చరించారు. బిచ్చగాళ్ల మాఫియాపై సౌదీలో ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తామన్నారు. వారిపై పాక్ ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.