వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9మంది మృతి

9 people died in different road accidents

Sep 12, 2024 - 13:50
 0
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9మంది మృతి

చెన్నై: తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరం సమీపంలో కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. కారులో ఐదుగురు వ్యక్తులు చెన్నై నుంచి మైలాడుతురై వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. పోలీసులు తీవ్రంగా శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. లారీ డ్రైవర్‌,  క్లీనర్‌ అక్కడి నుంచి పరారయ్యారు. 

యూపీలో నలుగురు..

యూపీలోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు వ్యాపారులు మరణించారు. ఢిల్లీ -డెహ్రాడూన్ హైవేపై వేగంగా వస్తున్న కారు ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీకొనడంతో కారు ముక్కలైపోయింది. ఎర్టిగా కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు నలుగురూ అలీఘర్ వాసులుగా పోలీసులు గుర్తించారు.