బీజేపీ అభ్యర్థి బుఖారీ మృతి

BJP candidate Bukhari passed away

Oct 2, 2024 - 15:12
 0
బీజేపీ అభ్యర్థి బుఖారీ మృతి

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ లో ఒటింగ్​ ముగిసిన మరుసటి రోజే విషాదం చోటు చేసుకుంది. సూరన్​ కోట్​ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ముస్తాక్​ అహ్మద్​ షా బుఖారీ (75) గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. బుఖారీ ఉన్నట్లుండి అస్వస్థతకు గురికావడంతో ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మృతిచెందారు. బుఖారీకి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. 2022లో ఎన్సీపీతో తెగదెంపులు చేసుకున్న బుఖారీ రవీంద్ర రైనాతో ఉన్న సత్సంబంధాల కారణంగా బీజేపీలో చేరారు. ఈయన కొండ సామాజిక వర్గం షెడ్యూల్డ్​ తెగకు చెందినవారు. సూరంకోట్​ నుంచి బుఖారీ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్సీ ఫరూక్​ అబ్దుల్లాతో విబేధాల కారణంగా నాలుగు దశాబ్దాలుగా ఆ పార్టీకి సేవలందించి చివరకు పార్టీని వీడారు. బుఖారీ మృతి పట్ల కశ్మీర్​ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనా సంతాపం తెలిపారు. తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.